క్యాన్సర్ మీద తొమ్మిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో, చక్కెర క్యాన్సర్ కణాలను జాగృతం (మేల్కొనేట్లు) చేస్తుంది, కణతి ఏర్పడటానికి వేగాన్ని పెంచుతుంది అని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయనం క్యాన్సర్ పరిశోధన రంగంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అధ్యయనంలో చక్కెర, క్యాన్సర్ మధ్య ఉన్న సహజ సంబంధాన్ని కనుగొన్నారు.
బెల్జియంలోని వ్లామ్స్ ఇన్స్టిట్యూట్ వూర్ బయోటెక్నాలజీ (విఐబి), కాథోలికే యూనివర్శిటీ లియువెన్ (బెల్జియం) (కెయు లియువెన్) వ్రిజే యూనివర్సిటిఇట్ బ్రుస్సేల్ (వియుబి) అధ్యయనం చేసి, వార్బర్గ్ ప్రభావాన్ని(ఇందులో చెక్కర కారణంగా క్యాన్సర్ కణాలు వేగంగా విచ్ఛిన్నం అవుతాయి మరియు కణితి ఏర్పడే వేగం పెరుగుతుంది) స్పష్టం చేశారు.