Fine on Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ కూపన్స్‌తో ఒప్పంద వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి 2019లో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ (CCI suspends Amazon's deal with Futur Group) చేసింది. దీనితో పాటు నిబంధనల ఉల్లంఘనకు గానూ.. రూ.202 కోట్ల ఫైన్ వేసింది.
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌తో.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance retail) రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని.. సవాలు చేస్తు అమెజాన్ న్యాయపోరాటం చేస్తున్న తరుణంలోనే సీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇంతకీ వివాదం ఏమిటంటే..
ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన.. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)లో 49 శాతం వాటను కొనుగోలు చేసేందుకు రూ.1,400తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది అమెజాన్.
నిర్ణీత వాటాలకన్నా ఎక్కువ మొత్తంలో కొనుగోలుకోసం సీసీఐ (CCI on Amazon deal with future grop) అనుమతులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అమెజాన్ సీసీఐని ఆశ్రయించగా ఇందుకు ఆమోదం లభించింది. అయితే ఈ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో కీలక సమాచార దాచిపెట్టినట్లు సీసీఐ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. పెనాల్టీ కూడా విధించినట్లు తెలిపింది.
ఈ వివాదం నేపథ్యంలో సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని సీసీఐ అమెజాన్‌ను ఆదేశించింది. ఇందుకు 60 రోజుల గడువు విధించింది.
Also read: SBI: ఎస్బీఐ రుణాలు మరింత భారం- బేస్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెంపు!
Also read: UberEats: స్పేస్‌లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook