కాంగ్రెస్ పార్టీ మేఘాలయలో ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ నాగాలాండ్, త్రిపురలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం ఒక్కసీటు కూడా సాధించని స్థితిలో నిలబడింది హస్తం పార్టీ. గత ఎన్నికల్లో త్రిపురలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్... ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని దారుణ పరిస్థితిలో ఉండడం గమనార్హం.
మరోవైపు బీజేపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో త్రిపురలో ఏమాత్రం ప్రాధాన్యం లేని బీజేపీ... తన మిత్రపక్ష పార్టీలతో కలిసి ఏకంగా 40 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండం విశేషం. నాగాలాండ్‌లో 60 స్థానాలు ఉండగా... ఎన్డీపీపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.