Omicron deaths: 2022 ఏప్రిల్​ నాటికి యూకేలో ఒమిక్రాన్ వల్ల 75 వేల మరణాలు!

Omicron deaths: ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూకేలో దీని తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ వచ్చే ఏడాది ఒమిక్రాన్​ వల్ల మరణాలు భారీగా పెరగొచ్చని ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 08:37 AM IST
  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు
  • యూకేలో ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసులు
  • మరణాలు భారీగా పెరగొచ్చని అంచనాలు!
Omicron deaths: 2022 ఏప్రిల్​ నాటికి యూకేలో ఒమిక్రాన్ వల్ల 75 వేల మరణాలు!

UK is seeing the most rapid spread of the Omicron variant: ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా ఒమిక్రాన్​ వేరియంట్ (Omicron variant)​.. రానున్న రోజుల్లో మరణ మృదంగం సృష్టించనున్నట్లు తెలుస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్​ ఇప్పుడు అన్ని దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత పెరిగిపోయింది.

ముఖ్యంగా యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చుతున్నట్లు (Omicron cases in UK) ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి నివేదికలు. ఇటీవల ఒక్క రోజులోనే ఇక్కడ దాదాపు 600 కేసులు బయటపడటం.. తీవ్రతకు అద్దం పడుతోంది.

వచ్చే ఏడాది మరింత తీవ్రం..

యూకే ముందస్తు చర్యలు ప్రారంభించి తగిన జాగ్రత్తలు పాటించకుంటే.. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఓ నివేదిక. లండన్​ స్కూల్​  ఆఫ్ హైజీన్, ట్రాపికల్​ మెడిసిన్ విడుదల చేసిన ఈ నివేదికలో మరో భయంకరమైన విషయాన్ని తెలిపింది. కఠిన చర్యలు లేకుంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్​ నాటికి (Omicron deaths in UK) యూకేలో 25,000 నుంచి 75,000 మంది వరకు ఒమిక్రాన్​ వల్ల మరణించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య 60 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

వారిపై తీవ్ర ప్రభావం..

డెల్టా వేరింయంట్ (Delta Variant)​ కంటే వ్యాప్తిలో ఒమిక్రాన్​ వేగంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగా గతంలో ఆల్ఫా, డెల్టా వేరియంట్  కేసులు పెరిగినప్పటికంటే..అధికంగా ఒమిక్రాన్​ కేసులు పెరగొచ్చని అంటున్నారు.

ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి త్వరగా ఈ వేరియంట్ సోకే ప్రమాదముందని.. అంచనా వేస్తోంది నివేదిక.

మరిన్ని..

యూరొప్​వ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ భయాలు కొనసాగుతున్నాయి. యూకేతో పాటు డెన్మార్క్​లో కూడా ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

డేల్టా వేరియంట్​తో పోలిస్తే.. ఒమిక్రాన్ తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతున్నట్లు ఆధారాలు లేవని నివేదికలు ఇప్పటి  వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా అంచనా వేస్తున్నాయి. అయితే ఒమిక్రాన్​ వేరియంట్ వల్ల ప్రస్తుతం ఉన్న ప్రమాదం వేగంగా వ్యాప్తి చెందటమేనని చెబుతున్నాయి.

Also read: Omicron : అక్కడ వేగంగా పెరుగుతోన్న ఒమిక్రాన్, ఒక్కరోజులోనే రెట్టింపు అయిన కేసులు

Also read: US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News