Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. బుధవారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నేడు (డిసెంబరు 8) హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ.
మనీలాండరింగ్ కేసు విచారణలో హాజరయ్యేందుకు బుధవారం ఉదయం ఆమె ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు.
Actor Jacqueline Fernandez appears before Enforcement Directorate (ED) at its office in Delhi in connection with Rs 200 crore extortion case involving conman Sukesh Chandrasekhar pic.twitter.com/LNd6v5qs2y
— ANI (@ANI) December 8, 2021
ఎయిర్ పోర్ట్ లో అడ్డుకొని..
అంతకు ముందు.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ నెల 5న దుబాయికి వెళ్లాలని ముంబయి విమానాశ్రయానికి వెళ్లింది. ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమెను అడ్డుకొని.. ఈడీ లుక్ అవుట్ నోటీసులు ఉండడం వల్ల ఆమెను విదేశాలకు వెళ్లకుండా ముంబయి ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం (ఈఓడబ్ల్యూ) వారిని అరెస్ట్ చేసింది. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మరియా పాల్ సహా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ ప్రశ్నించింది. సుకేష్ చంద్రశేఖర్ కు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సంబంధం ఉందన్న నేపథ్యంలో విచారణ కోసం ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook