WHO Urges Asia Pacific Countries to ready for Omicron driven surge in infections : కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. రోజురోజుకి ఒమిక్రాన్ విస్తరిస్తోంది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్,జపాన్, మలేషియాతో పాటు భారత్ పలు ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పుట్టుకొస్తున్నాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు ఉన్నా కూడా ఈ వేరియంట్ వ్యాపిస్తూనే ఉంది.
ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వో (WHO) తాజాగా పలు సూచనలు చేసింది. ఒమిక్రాన్.. కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఆసియా, పసిఫిక్ దేశాలు ఆరోగ్య వ్యవస్థల బలాన్ని పెంపొందించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అలాగే ఆయా దేశాలు ప్రజలకు వ్యాక్సినేషన్‌ను (Vaccination) ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
దక్షిణాఫ్రికాలో (South Africa) బయటపడ్డ ఈ ఒమిక్రాన్‌ను డబ్ల్యూహెచ్‌వో ఆందోళనకరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఇక ప్రస్తుతం దేశాలన్నీ కేవలం సరిహద్దు కట్టడి చర్యలపై మాత్రమే ఆధారపడకూడదని... డబ్ల్యూహెచ్‌వో (WHO regional director for the western Pacific) పశ్చిమ పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేషి కసాయ్ (Takeshi Kasai) ,పేర్కొన్నారు.
Also Read : Jawad Cyclone: జవాద్ తుఫానుగా మారిన అల్ప పీడనం- ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ఒమిక్రాన్ (Omicron) ఎదుర్కొనేందుకు.. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనాను (Corona) ఎదుర్కొనేందుకు పాటిస్తున్న విధానాలు సరిపోతాయని తెలుస్తోందని తెలిపారు. వాక్సినేషన్, మాస్కు ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
Also Read : Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. ప్రాణాలతో కాపాడిన రైల్వే పోలీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Omicron : ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్త.. డబ్ల్యూహెచ్‌వో సూచన
ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్నకొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్
పలు దేశాల్లో పుట్టుకొస్తున్న ఒమిక్రాన్ కేసులు
విదేశీయుల రాకపై ఆంక్షలు ఉన్నా వ్యాపిస్తున్న వేరియంట్