Omicron Version Vaccine: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా..ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది.
కరోనా మహమ్మారి(Corona Pandemic) కొత్త రూపంతో దాడి చేస్తోంది. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పటికే 16 దేశాలకు విస్తరించింది. యూరప్, ఆసియా దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో 30 మ్యూటేషన్స్ ఉండటం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లకు ఈ వేరియంట్ లొంగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ ఇప్పటికే తీసుకున్నవారికి సైతం కొత్త వేరియంట్ సోకవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు మరోసారి విధించాయి. విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల్ని తప్పనిసరి చేశాయి.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)సైతం ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)అతి ప్రమాదకరమంటూ హెచ్చరించింది. మ్యూటేట్ అయిన కరోనా వైరస్ తీవ్ర పరిణామాలతో వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ను గుర్తించిన కొద్దిరోజులకే విదేశీయుల ప్రవేశాన్ని వివిధ దేశాలు నిషేధిస్తున్నాయి. అమెరికా, జపాన్, యూరోపియన్ దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాల్ని నిషేధించాయి.
ఈ నేపధ్యంలో రష్యా మరో అడుగు ముందుకేసింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కొత్తరకం కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రారంభించింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని..స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను(Sputnik v vaccine) రష్యన్ సంస్థ గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రో బయాలజీ సిద్ధం చేస్తోంది. స్పుత్నిక్ వి, స్పుత్నిక్ వి లైట్ వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఏ విధంగా అడ్డుకుంటాయనే విషయంపై అధ్యయనం చేస్తోంది. కొత్త స్పుత్నిక్ వి ఒమిక్రాన్ వెర్షన్‌ను(Covid10 New Vaccine)45 రోజుల్లోనే భారీగా ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా చెబుతోంది. 2022 ప్రారంభంలోనే స్పుత్నిక్ ఒమిక్రాన్ బూస్టర్ షాట్స్ భారీగా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశించే అవకాశాలున్నాయి.
Also read: డిసెంబర్ 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే, ఇవాళ తప్పనిసరిగా చేయాల్సిన పనులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook