Heavy Rains in Tamilnadu: తమిళనాడును భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తుతున్నాయి. చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించారు. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నైసహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్, శివగంగ, దిండిగుల్, మధురైలోని ఆయా ప్రాంతాలు నీటమునిగాయి.
తమిళనాడు(Tamilnadu)లో వర్షాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు. వీరిలో ముగ్గురు శుక్రవారం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వరద బాధితుల కోసం మొత్తం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చింగ్లేపేట, కాంచీపురంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు తెలిపారు.
Also Read: Weather Alert: ముంచుకొస్తున్న మరో ముప్పు...మళ్లీ మరో అల్పపీడనం...ఏపీకి భారీ వర్ష సూచన!
కేప్ కొమోరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా తుపాను ఆవరించి ఉందని, దీంతో తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ విభాగం(IMD) స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో ఈ మూడు రోజులు తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు(Rains) కురుస్తాయని తెలిపింది. జాలరులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచనలు చేసింది. దీంతోపాటు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం(Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం చెన్నైతోసహా ఇక్కడి 21 ఒక్క జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook