TTD Darshan Tickets: డిసెంబరు నెలకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల.. 10 నిమిషాల్లోనే ఖాళీ

TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున విడుదల చేయగా.. అవి 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 11:01 AM IST
    • తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల
    • 10 నిమిషాల్లో ఖాళీ చేసిన భక్తులు
    • ఆదివారం అద్దె గదుల కోటా విడుదల
TTD Darshan Tickets: డిసెంబరు నెలకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల.. 10 నిమిషాల్లోనే ఖాళీ

TTD Darshan Tickets: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శన ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Online Tickets) విడుదల చేసింది. డిసెంబర్‌ నెల టికెట్లను టీటీడీ శనివారం ఉదయం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది. ఓటీపీ, వర్చువల్‌ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయిస్తున్నారు. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున టీటీడీ నెల కోటా విడుదల చేసింది. అయితే, విడుదల చేసిన 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి.

డిసెంబర్ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటన పేర్కొంది. గత రెండు నెలలుగా సర్వదర్శనం (Sarva Darshanam) టోకెన్లను ఆన్‌లైన్ ద్వారానే టీటీడీ విడుదల చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం కోసం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ (TTD) ప్రకటనలో పేర్కొంది.

Also Read: CM Jagan: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు-అసెంబ్లీ వేదికగా జగన్ కౌంటర్

Also Read: Tirupati: తిరుపతిలో షాకింగ్ ఘటన- భూమి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్​  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News