Newborn baby killed: పసికందును చంపిన తల్లి.. ఆ మనోవేదనతోనే హత్య..

Rape survivor killed her newborn baby: ఓ అత్యాచార బాధితురాలు తన కన్నబిడ్డను గొంతు నులిమి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శిశువు అనారోగ్యానికి గురైందని మొదట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసుల విచారణ శిశువు తల్లి నేరం అంగీకరించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 02:22 PM IST
  • మధ్యప్రదేశ్‌లో కన్న బిడ్డను చంపుకున్న అత్యాచార బాధితురాలు
    అత్యాచారం, గర్భం దాల్చడంతో మానసిక క్షోభతో బాధితురాలు
    తీవ్ర మనోవేదనతో పసికందును గొంతునులిమి చంపిన వైనం
Newborn baby killed: పసికందును చంపిన తల్లి.. ఆ మనోవేదనతోనే హత్య..

Rape survivor killed her newborn baby: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ అత్యాచార బాధితురాలు (Rape Victim) తన కన్నబిడ్డను హత్య చేసింది. పసికందు అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేసింది. అత్యాచారం, ఆపై గర్భం దాల్చడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు... ఆ మనోవేదనతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లా తెందుఖేదా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... తెందుఖేదా గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక (Minor girl) అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో చనువుగా ఉండేది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికపై ఆ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గర్భం దాల్చిన (Pregnant) బాలిక... ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. గర్భం దాల్చిన విషయం తెలియడంతో బాలుడు ఆమెను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆమె గర్భంతో ఉన్నట్లు చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా.. జరిగిన ఘటన గురించి వారితో చెప్పింది.

బాధిత బాలిక కుటుంబ సభ్యులు అత్యాచార ఘటనపై (Minor girl raped) స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం (Pocso Act) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోమ్‌కు తరలించారు. కొద్దిరోజులకు బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే అక్టోబర్ 16న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నవంబర్ 5న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది.

Also Read: అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!

ఆ తర్వాత ఐదు రోజులకు బిడ్డను తీసుకుని హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లిన ఆ బాలిక... శిశువు ఆరోగ్యం బాగా లేదని వైద్యులతో చెప్పింది. వైద్యులు ఆ శిశువును పరిశీలించగా... అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు నిర్దారించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిర్వహించగా.. బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. దీనిపై పోలీసులు బాలికను ప్రశ్నించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో బాలికపై (Rape on Minor girl) కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ కోర్టు ఆదేశాల మేరకు ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News