Ys Jagan Letter On Flood Aid: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడింది. ఆస్థినష్టం, ప్రాణనష్టం భారీగా సంభవించింది. వరద సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీగా ఆస్థి, ప్రాణనష్టం కలిగింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు(Amit Shah)లేఖ రాశారు. వరద సహాయంగా వేయి కోట్లు విడుదల(Flood Aid) చేయాలని విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా జరిగిన ప్రాధమిక నష్టం నివేదికను పంపించారు. వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్రం నుంచి బృందాల్ని పంపించాలని కోరారు.
వైఎస్ జగన్ లేఖలో..
నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో భారీ వర్షాలకు(Heavy Rains)పలు ప్రాంతాలు నీటమునిగాయి.196 మండలాలు నీటమునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయి.
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. కడప, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి..వరద నష్టం, ప్రాణనష్టం వివరాలపై ఆరా తీశారు. బంగాళాఖాతంలో(Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుందనే హెచ్చరికల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
Also read: ఉల్లి కాదు కన్నీరు తెప్పించేది టొమాటోనే, ఆకాశాన్ని తాకుతున్న ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook