తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మీ పతనం చూడాలనే నాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మరోసారి తెరపైకొచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే సందర్భంలో ముద్రగడ కుటుంబ సభ్యుల్ని రోడ్డుకీడ్చడం, పోలీసులు బూటుకాళ్లతో తన్నించడం సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ అయింది. ముద్రగడ కుటుంబాన్ని, ముద్రగడ ఇంటి మహిళలన్ని చంద్రబాబు అవమానించలేదా అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు లేఖ రాశారు.
ఆ లేఖలో ముద్రగడ ఆవేదన ఇదీ
ఇటీవల మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు. మీ కుమారుడు లోకేష్(Lokesh) ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను.. నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం హస్పటల్లో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు.
మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. నా కుటుంబాన్ని అవమానపరచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాధను చేశారు. శపధాలు చేయకండి చంద్రబాబు(Chandrababu)గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి అని లేఖలో రాశారు.
Also read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, భారీ వర్షాలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook