అక్కినేని నాగార్జున శ్రీదేవి జంటగా నటించిన సినిమా గోవిందా గోవిందా . ఈ సినిమాలో 'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో' పాట శ్రేదేవిని కీర్తించడంలో అత్యున్నతమైన పాటగా నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి పాటను అంత్యక్రియలకు వాడటంపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ అభ్యంతరం చెబుతున్నారు. ట్విట్టర్ వేదిక ద్వారా వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఎందుకో తెలుసా...
శ్రీదేవిని పుట్టించినందుకు బ్రహ్మను కీర్తిస్తూ పాడే పాట అది.. అందుకే శ్రీదేవి అంత్యక్రియలకు ఆ పాట సరైంది కాదన్నాడు వర్మ. తాను ఎంతగానో అభిమానించే నటి శ్రీదేవి మరణం తాలూకు విషాదం నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రకమైన ట్వీట్ చేశారు.
I intended the lyrics “Amma Brahmma Devudo ..Kompa Munchinavuro” from GOVINDA GOVINDA song with @iamnagarjuna to be an upper limit praise to God Brahma for creating Sridevi ..Never imagined this can be used in her funeral too https://t.co/X4Ch4WcN1u
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2018