IND Vs NZ 3rd T20 2021: యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో టీమ్ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ జట్టు (India Vs New Zealand) ఇప్పుడు భారత పర్యటనలో డీలా పడింది. టీ20 సిరీస్ లో భాగంగా ఆడిన రెండు మ్యాచుల్లో ఇండియన్ టీమ్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచులో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు సిరీస్ లో తొలి విజయాన్ని నమోదు చేసేందుకు కివీస్ జట్టు సన్నాహాలు చేస్తోంది.
తుదిజట్టులో మార్పులు?
యువ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ లకు అవకాశం కల్పించిన టీమ్ఇండియా మేనేజ్ మెంట్ (Team India Selection) ఆఖరి టీ20లోనూ వీరిద్దరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ మైదానంలో దిగడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రుతురాజ్.. ధావన్ నేతృత్వంలో శ్రీలంకలో పర్యటించిన ద్వితీయ శ్రేణి జట్టులో సభ్యుడు. అప్పుడు రెండు టీ20లు ఆడిన రుతురాజ్.. మరో అవకాశం కోసం చూస్తున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటి టీమ్‌ఇండియాలో స్థానం దక్కించుకున్న మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్ కూడా అరంగేట్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కోసం రాహుల్‌తో పాటు భువనేశ్వర్, దీపక్ చాహర్‌ల్లో ఒకరికి విశ్రాంతినివ్వొచ్చు.
మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన అశ్విన్, అక్షర్‌ల్లో ఒకరిని తప్పించి చాహల్‌ను ఆడించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన కివీస్‌ను బౌలర్లు కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. రోహిత్ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించాయీ మ్యాచ్‌లో. బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో మాత్రం శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. వెంకటేష్ అయ్యర్ కూడా సత్తా చాటుకోవాల్సి ఉంది. అతడికి ఇంకా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. చివరి టీ20లో అతడి చేతికి రోహిత్ బంతి అందించొచ్చు. గత మ్యాచ్‌లో మాదిరే బ్యాటింగ్‌లో కాస్త ముందు పంపే అవకాశముంది.
న్యూజిలాండ్ విజయం సాధిస్తుంది?
సిరీస్ కోల్పోయినంత మాత్రాన కివీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శనను మరిచిపోకూడదు. విలియమ్సన్, కాన్వే లేకపోవడం బ్యాటింగ్‌లో ఆ జట్టును దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ లో సీఫర్ట్, నీషమ్ రాణించాల్సిన అవసరముంది. గప్తిల్, మిచెల్, చాప్‌మన్ ఫామ్ కొనసాగించడం కీలకం. బౌలర్లు సమష్టిగా రాణించలేకపోతున్నారు. తొలి మ్యాచ్‌లో బౌల్ట్, శాంట్నర్.. రెండో టీ20లో సౌథీ రాణించారు. మూడో టీ20లో అయినా బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటాలని కివీస్ కోరుకుంటోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens Pitch Report) స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.. ఇలాంటి పిచ్ పై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Also Read: సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్!
Also Read: ఇండియా, న్యూజిలాండ్ టీ20 మ్యాచును వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook