అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపీ పాలిసెట్) రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 22వ తేదీ లేదా అంతకంటే ముందుగా అభ్యర్థులు తమకు సీట్లు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం స్పష్టంచేసింది. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.in లో అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల వివరాలు చెక్ చేసుకోవచ్చు.
ఏపీ పాలిసెట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవచ్చంటే..
> appolycet.nic.in హోమ్ పేజీలో క్యాండిడెట్ లాగిన్ అని ఉన్న చోట క్లిక్ చేయండి.
> మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ నొక్కండి.
> మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన అనంతరం అలాట్‌మెంట్ లెటర్ లింకుపై క్లిక్ చేయడంతోనే అలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also read : సాగు చట్టాల రద్దుపై పవన్ కల్యాణ్ రియాక్షన్... ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారంటూ...
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా సీట్ల కేటాయింపును ఖరారు చేస్తూ ఫ్లోట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Also read : తిరుపతి, తిరుమలలో జలవిలయం...స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook