మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

Minor Girl Rape In Thane: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పని ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపి.. ఓ 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం చేశాడో 40 ఏళ్ల ప్రబుద్ధుడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సదరు నిందితుడ్ని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 02:20 PM IST
    • మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం
    • 14 ఏళ్ల గిరిజన బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
    • నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

Minor Girl Rape In Thane: మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. 14 ఏళ్ల గిరిజన బాలికపై 40 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారం చేసిన ఘటన గురువారం బహిర్గతమైంది. ఈ సంఘటన గత ఆదివారం భివాండి తాలూకాలో జరగగా.. దారుణానికి పాల్పడిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాలిక సంరక్షణాలయానికి పంపినట్లు అధికారులు వెల్లడించారు.

పని ఇప్పిస్తానని ఆశ చూపి..

మహారాష్ట్రలోని పాల్ఘర్ కు చెందిన బాధితులరాలి తల్లిదండ్రులు ఇటుకల బట్టీలో పనిచేస్తూ.. బతుకునీడుస్తున్నారు. ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తి ఇంటి పనుల కోసమని చెప్పి బాలికను అక్కడి నుంచి భివాండిలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. ఆదివారం రోజున తన తల్లిదండ్రులను చూసేందుకు పాల్ఘర్ తీసుకెళ్లమని ఆ బాలిక యజమానిని కోరింది.

వారిద్దరూ కలిసి పాల్ఘర్ బయల్దేరగా.. మార్గ మధ్యంలో అంగావ్ గ్రామ సమీపంలోకి చేరుకున్నప్పుడు.. నిందితుడు బాలికను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో బాలిక అరిచేందుకు ప్రయత్నించగా ఆమెను కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి ఎవరికైనా తెలియజేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని నిందితుడు బెదిరించినట్లు బాలిక వివరించిందని పోలీసు వెల్లడించారు.  

ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో మంగళవారం రాత్రి స్థానికి ఎన్టీవో సహాయంతో పోలీసులను ఆశ్రయించిందా కుటుంబం. కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం నిందితుడ్ని అరెస్టు చేశారు. పోక్సో చట్టం, షెడ్యూలడ్ కులాలు, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Also Read: చెన్నైకు పొంచి ఉన్న మరో జల ప్రళయం, ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

Also Read: కర్ణాటక రాజకీయాల్లో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు, ఆ ఇద్దరు మంత్రులే కారణమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News