Anurag Thakur News: పాకిస్తాన్ వేదికగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అయితే పాకిస్తాన్ వేదికగా క్రికెట్ మ్యాచులు జరగనున్న క్రమంలో ఆ దేశానికి క్రికెటర్లు పంపాలా? లేదా? అని పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur News) స్పందించారు. పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే విషయంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన అన్నారు.
“సమయం వచ్చినప్పుడు.. భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అన్నీ అంశాలను పరిశీలిస్తాం. గతంలోనూ, భద్రతా కారణాల వల్ల చాలా దేశాలు పాకిస్తాన్ లో ఆడేందుకు నిరాకరించాయి. మీ అందరికీ తెలిసినట్లుగా.. పాకిస్తాన్ లో మ్యాచులు ఆడే క్రమంలో చాలా మంది క్రికెటర్లు దాడికి గురయ్యారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
రానున్న ఐసీసీ టోర్నీలకు వేదికలివే..
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (ICC Champions Trophy 2025) పాకిస్తాన్ వేదిక కానుందని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC News) ప్రకటించింది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది. 2024 – 2031 మధ్య కాలంలో పురుషుల విభాగంలో రెండు ఐసీసీ వరల్డ్ కప్ లు, నాలుగు టీ20 ప్రపంచకప్ లతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్స్ ను నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఈ ఈవెంట్లకు అమెరికాతో పాటు నమీబియా మొదటిసారి వరల్డ్ కప్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Also Read: న్యూజిలాండ్ జట్టుకు మరోషాక్.. ఇండియాతో టెస్టు సిరీస్ కివీస్ బౌలర్ ఔట్
Also Read: IND VS NZ: కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ కు తొలి పరీక్ష...కివీస్ తో టీ20 నేడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook