Madanapalle Tomato Price: రాష్ట్రంలో రూ.100 లకు పెరిగిన కిలో టమాటా ధర

Madanapalle Tomato Price: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలికింది. వరుస వర్షాలతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గడం వల్ల మంగళవారం కిలో టమాటా రూ.100కు విక్రయించారు. 28 కిలోల కేట్‌ ధర గరిష్ఠంగా రూ.2,800 పలకడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 10:37 AM IST
    • ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన టమాటా ధర
    • మదనపల్లె మార్కెట్లో రూ.100 లకు పెరిగిన కిలో టమాట
    • భారీ వర్షాల కారణంగానే ధరలు పెరిగినట్లు చెప్పిన వ్యాపారులు
Madanapalle Tomato Price: రాష్ట్రంలో రూ.100 లకు పెరిగిన కిలో టమాటా ధర

Madanapalle Tomato Price: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. దీంతో నాన్ వెజ్ ధరలతో టమాటా, ఉల్లిపాయ ధరలు పోటీ పడుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. క్రమంగా తినే టమాటా వైపు చూడాలంటే భయమేస్తుందని వాపోతున్నారు. గత నెల రోజులక్రితం రూ.30 లు ఉన్న టమాటా రేటు… ఇప్పుడు రూ. 100 లకు చేరుకుంది. రిటైల్ మార్కెట్లోనే కాదు.. వ్యవసాయ మార్కెట్ లో కూడా ఎన్నడూ లేనంతగా టమాటా ధర ఆకాశాన్ని తాకుతుండడం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఏపీలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. దీనికి కారణం ఏపీలో కురుస్తున్న వర్షాలు అని మదనపల్లెలోని టమాటా వ్యాపారాలు చెబుతున్నారు.

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన టమాటా ధరలు కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయించేవారు. సెప్టెంబర్ చివరిలో మార్కెట్, గత వారంలో రూ. 50-70కి చేరుకుంది. అయితే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది.

Also Read: AP Three Capital Issue: కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా

Also Read: Anantapur robbery : అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం.. ఉపాధ్యాయురాలి హత్య 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News