High tension in Bandi Sanjay Suryapet tour : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్ద బీజేపీ శ్రేణుల పైకి టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బండి సంజయ్‌కి (Bandi Sanjay) స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్గీయులు రాళ్లు, కర్రలతో తమపై దాడికి పాల్పడినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.
అంతకుముందు ఆత్మకూరు పట్టణంలోనూ బండి సంజయ్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ శ్రేణులు (BJP) కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంతకుముందు, చివ్వెంల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ (Bandi Sanjay) గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు కూడా పోటాపోటీ నినాదాలు చేయగా... పోలీసులు ఇరువురిని చెదరగొట్టారు.
Also Read: MLC Notification: తెలంగాణలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా నోటిఫికేషన్ విడుదల
మంగళవారం(నవంబర్ 16) ఉదయం సూర్యాపేటలో (Suryapet) మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. తమపై వరుస దాడులకు సీఎం కేసీఆరే సూత్రధారి అని ఆరోపించారు. వానాకాలంలో రైతులు పండించిన ప్రతీ గింజ కొనాలని కోరితే తమపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడుల్లో 8 వాహనాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారని... సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులే ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని... తమ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చినా పోలీసులు భద్రత కల్పించకలేకపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆరే (CM KCR) శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. వానాకాలం పంట కొనేంతవరకూ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతకుముందు, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ సంజయ్‌కి ఫోన్ చేసి నిన్నటి దాడులు, ఉద్రిక్తతల గురించి అడిగి తెలుసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Bandi Sanjay: బండి సంజయ్ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత...
బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత
సూర్యాపేట ఆత్మకూరులో అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు
చివ్వెంలలో బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు