food on domestic flights: తక్కువ ప్రయాణ దూరం ఉన్న విమానాల్లోనూ ఆహారం!

Serving food on flight: దేశీయంగా ప్రయాణించే విమానాల్లోనూ ఆహారం అందించేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 02:27 PM IST
  • త్వరలో తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లోనూ ఆహారం సరఫరా!
  • కొవిడ్ మార్గదర్శకాలను సవరిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు
  • దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నిర్ణయం
food on domestic flights: తక్కువ ప్రయాణ దూరం ఉన్న విమానాల్లోనూ ఆహారం!

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్​ ఆంక్షలను (ఇప్పుడు అమలులో ఉన్నవాటిని) క్రమంగా సడిలించేందుకు కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కఠిన నిబంధనల నుంచి సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విమానాల్లో తక్కువ దూరాలకు అంటే.. 2 గంటల్లోపు ప్రయాణ సమయం ఉన్న ఫ్లయిట్​లలో కూడా ఆహారం అందించే విధానాన్ని పునరుద్ధరించవచ్చని పౌర విమానయాన శాఖకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో పాటు.. విమాన సిబ్బంది కవరల్స్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు సమాచారం.

కవరల్స్ నుంచి మినహాయింపు ఇచ్చినా.. గ్లవ్స్, మాస్క్​, ఫేస్​ షీల్డ్​ మాత్రం తప్పని సరిగా ధరించాలని చెప్పినట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.

ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. విమానయాన సంస్థలు రెండు గంటల్లోపు విమాన ప్రయాణ దూరాలకు ఆహారం సర్వ్ చేయడం నిషేధం.

 ఏప్రిల్ 15 నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ నిబంధనల కారణంగా దేశీయంగా ప్రయాణించే దాదాపు అన్ని విమానాల్లో ఆహారం అందిచడం కుదరదు. తాజాగా ఈ నిబంధనలను తొలగించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే త్వరలోనే దేశీయ, 2 గంటల్లోపు ప్రయాణ సమయం ఉన్న విమానాల్లోనూ ఆహారం అందించే సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Also read: Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్

Also read: Karnataka: యువతి బలవన్మరణం..కాబోయే భర్త వేధింపులే కారణం..!

దేశంలో కరోనా కేసులు ఇలా..

శుక్రవారంతో పోలిస్తే దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఒక్క రోజు దేశవ్యాప్తంగా 11,271 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 98.2 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.35 శాతంగా ఉన్నట్లు తెలిపింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ప్రస్తుతం దేశంలో 1,35,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 1,12,01,03,225 డోసుల టీకా వేశారు. శనివారం ఒక్క రోజే 57,43,840 డోసులు పంపిణీ చేశారు.

Also read: Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ

Also read: Curfew in Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. 4 రోజుల పాటు కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News