Andhra pradesh minister perni nani reacts on telangana minister Prashanth Reddy comments: తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కొన్ని రోజుల క్రితం నదీ జలాల విషయంలో (river waters) ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. తర్వాత అది కాస్త సద్దుమణిగింది. అయితే మళ్లీ అలాంటి మాటల యుద్ధమే మొదలైంది.
తాజాగా నిజామాబాద్‌లో (Nizamabad) నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashant Reddy) అన్నారు. కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు (Andhra) పోవట్లేదని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ భిక్షమెత్తుకుంటున్నారన్నారు. చివరకు రోజు ఖర్చులకు కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
అయితే తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Telangana Minister Prashant Reddy) వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. కేంద్ర నిధుల కోసం భిక్షమెత్తుకుంటున్నామని అంటున్నారు... తెలంగాణ మంత్రులు చేసిన ఈ వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి పేర్ని నాని (AP Minister Nani) అన్నారు. తెలంగాణ ఎన్ని అప్పులు చేసిందో.. బ్యాంకులను (Banks) అడిగితే తెలుస్తుందని పేర్ని నాని ఆరోపించారు.
Also Read : Mega Daughter Divorce:చిరంజీవి చిన్న కూతురు విడాకులు..?రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP Chief Minister Jagan Mohan Reddy) ఎప్పుడూ ఒకటే విధానంతో ముందుకు వెళ్తారని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ లాగా బయటొక మాట, లోపలొక మాట మాట్లాడరని అన్నారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలు..రావాల్సిన నిధుల కోసం వెళ్లి కేంద్రాన్ని అప్పు అడుగుతామో...లేదంటే మా పరిస్థితి బాగలేక..మేము అడుక్కు తింటామో.. ఏదో ఒకటి చేస్తాం వ్యాఖ్యానించారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ( Telangana Chief Minister) పదే పదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ప్రవ్నించారు. అప్పుల (Debts) కోసం తెలంగాణ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తరచుగా కేంద్రం వద్దకు దేనికి వెళ్తున్నారని పేర్ని నాని అన్నారు. బయట కాలర్ ఎగరేసి.. లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్‌కు (Jagan) రాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్‌ను (Hyderabad) అభివృద్ధి చేశారని పేర్ని నాని అన్నారు.
Also Read : Harish Rao: ఏడేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణకు ఏ సాయం అందలేదు- మంత్రి హరీశ్‌రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి