Bholaa Shankar: చిరంజీవి భోళా శంక‌ర్ నుంచి అప్‌డేట్‌.. 11న మూహుర్తం..

Bhola Shankar On November 11th opening puja :చిరంజీవి (Chiranjeevi) అత‌నికి భోళా శంక‌ర్ (Bholaa Shankar) అనే ప్రాజెక్ట్‌ని అప్ప‌గించారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ విషయంలో ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 11:08 AM IST
  • భోళా శంకర్ ముహూర్త వేడుక విశేషాలు తెలిపిన డైరెక్టర్ మెహర్ రమేష్
  • నవంబర్ 11న మూవీ ముహూర్తం
  • నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూట్
Bholaa Shankar: చిరంజీవి భోళా శంక‌ర్ నుంచి అప్‌డేట్‌.. 11న మూహుర్తం..

Chiranjeevi Meher Rameshs Bhola Shankar On November 11th opening puja 15th onwards shoot begins: మెహ‌ర్ ర‌మేష్ కెరీర్‌‌లో బిల్లా మూవీ తప్ప మరో హిట్ లేదు. కంత్రి, శక్తి, షాడో వంటి డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు మెహర్. ఇక ఆయ‌న సినిమాలు తీయ‌క కూడా చాలా రోజులే అవుతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) అత‌నికి భోళా శంక‌ర్ (Bholaa Shankar) అనే ప్రాజెక్ట్‌ని అప్ప‌గించారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ విషయంలో ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది.

అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇక రాఖీ స్పెషల్, చిరంజీవి బర్త్ డే సందర్భంగా భోళా శంకర్ (Bholaa Shankar) టైటిల్ పోస్టర్, కీర్తి సురేష్, చిరంజీవి బంధాన్ని తెలియజేసే వీడియోను అప్పట్లో వదిలారు.

Also Read : Electric Buses: తిరుమలకు కొత్త సౌకర్యాలు, కాలుష్య నియంత్రణకు E Buses

యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న‌ భోళా శంకర్‌ మూవీని తాజాగా ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు.

 

మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) ట్విట్టర్ ద్వారా భోళా శంకర్ ముహూర్త వేడుక విశేషాలు పంచుకున్నారు. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు మూవీ ముహూర్తం ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి చిరంజీవి (Chiranjeevi) భోళా శంక‌ర్ (Bholaa Shankar) రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. ఈ మూవీకి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ (Mahathi Swarasagar) మ్యూజిక్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Also Read : Covid-19 Update: దేశంలో మరో 10,126 మందికి కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News