New Delhi: యమునా నది(yamuna river)లో అమోనియా (Ammonia) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా స్తంభించింది. వాజిరాబాద్(Wazirabad) ప్రాంతంలోని యుమునా నదిలో అమోనియా స్థాయి 3పీపీఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఈ ప్రభావం పడినట్లు వెల్లడించారు.
హర్యానా(haryana) నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని దిల్లీ నీటి సరఫరా బోర్డ్ వైస్ ఛైర్మన్ రాఘవ్ చద్ధా తెలిపారు. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. పెరిగిన నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి (cause of water pollution in yamuna) ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హరియాణా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
Also read: Chennai Floods: చెన్నైని ముంచెత్తనున్న వర్షాలు, వెంటాడుతున్న 2015 వరద భయం
"నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాను. తగిన సంఖ్యలో నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాము. యమునా నది నీటిలో అమోనియా స్థాయి పెరగడం వల్ల నీటి సరఫరా ప్రభావం పడింది"-రాఘవ్ చద్ధా, దిల్లీ వాటర్ బోర్డ్ వైస్ ఛైర్మన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook