Sri Lanka Vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న వెస్టిండీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఇప్పటికే సెమీస్ అవకాశాలు చేజార్చుకున్న శ్రీలంక జట్టు వెస్టిండీస్‌ను ఓడించి దాని సెమీస్ ఆశలను వమ్ముచేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్‌పై (SL Vs WI) 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్ సెమీస్ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. చరిత్ అసలంక (68; 8 ఫోర్లు, ఒక సిక్స్), నిస్సాంక (51; ఐదు ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కుశాల్ పెరీరా (29; రెండు ఫోర్లు, ఒక సిక్స్), డాసెన్ శనక (25*; రెండు ఫోర్, ఒక సిక్స్) రాణించారు. కీలకమైన మ్యాచ్‌లో లంకపై వెస్టిండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్ బౌలర్లలో రస్సెల్ 2, బ్రావో ఒక వికెట్ తీశారు.
టీ20 ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌ల్లో శ్రీలంక కేవలం రెండు విజయాలు సాధించి మెగా టోర్నీ నుంచి ఘనంగా వైదొలిగింది. ఇక సూపర్ 12 గ్రూప్ 1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా, రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. వెస్టిండీస్ 4 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ మెగా టోర్నీలో ఇక తన చివరి మ్యాచ్‌లో విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో (WI vs AUS) పోటీపడనుంది.
Also Read: Virat Dancing in Ground: మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేసిన విరాట్.. వీడియో వైరల్
Also Read: Rahul Dravid as India Head Coach: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఏకగ్రీవ ఎంపిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook