Covid update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 16 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 13,40,158 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,906 కేసులు(Covid Cases in india) వెలుగులోకి వచ్చాయి. ఇక పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిన్న 561 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు(Covid-19 Deaths) కోల్పోయిన వారి సంఖ్య 4,54, 269కి చేరింది.
గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలే(Recovery Cases) ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 16,479 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరి ఆ రేటు 98.17 శాతానికి పెరిగింది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యధికం. క్రియాశీల కేసుల కొండ కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,72,594 చేరి ఆ రేటు 0.51 శాతానికి దిగివచ్చింది.
COVID19 | India reports 15,906 new cases in the last 24 hours; Active caseload stands at 1,72,594 pic.twitter.com/lM2VKh1COX
— ANI (@ANI) October 24, 2021
Also read: Covid19 Booster Dose: ఇండియాలో కరోనా బూస్టర్ డోసు ఎప్పడు ? స్పష్టం చేసిన ఎయిమ్స్
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్(Covid-19 vaccination) వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 77,40,676 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 1.02 కోట్లకు చేరింది.
వరల్డ్ వైడ్ గా...
ప్రపంచవ్యాప్తంగాను రోజువారి కరోనా కేసుల సంఖ్య (coronavirus world wide) భారీగా తగ్గింది. తాజాగా 3,74,274 మంది వైరస్ (Corona update) బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,735 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,41,09,329కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,59,193కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook