Gold Demand: ఇండియాలో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడబోతుందా..వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితులకు..భవిష్యత్‌లో ఉన్న పరిస్థితులకు తేడా ఏంటి..పసిడి డిమాండ్ ఊహించినదానికంటే ఎక్కువ కానుందా. వివరాలు పరిశీలిద్దాం.
ఇండియాలో బంగారం పరిస్థితులపై సమగ్ర నివేదిక వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(World Gold Council)విడుదల చేసిన నివేదికలోని అంశాలు కొన్ని కలవరపెడుతుంటే మరికొన్ని ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుత ఏడాది 2021లో ఎలా ఉంటుంది, 2022లో ఎలా ఉండబోతుందనే వివరాల్ని ఆ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. కోవిడ్ 19 సవాళ్ల నేపధ్యంలో 2021లో అంటే ఈ ఏడాది బంగారం డిమాండ్ తగ్గిపోతుందని గోల్డ్ కౌన్సిల్ నివేదిక అభిప్రాయపడింది. ఇండియాలో బంగారం డిమాండ్‌కు చోదకాలు పేరుతో విడుదలైన నివేదికలో ఆసక్తికర అంశాలున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో అంశాలు(World Gold Council Report)
- కోవిడ్19తో యుద్ధం కారణంగా 2021 చివరికి పసిడి డిమాండ్ భారీగా తగ్గనుంది. ఊహించినదానికంటే ఎక్కువగా డిమాండ్ పడిపోయే అవకాశం.
- కరోనా ఆంక్షలు తొలగిపోయే కొద్దీ పరిస్థితిలో మెరుగుదల, 2022 నాటికి పెరగనున్న డిమాండ్
- కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)సవాళ్లు తలెత్తితే మాత్రం పరిస్థితిలో మార్పు ఉంటుందని అంచనా
- ఇండియాలోని పసిడి పరిశ్రమలు పారదర్శకత, ప్రమాణాల దిశగా చర్యలు తీసుకోవల్సిన అవసరం. అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటించాల్సి ఉంటుంది.
- ఇండియాలో బంగారం డిమాండ్‌కు ఎదురుకానున్న సవాళ్లలో గృహం పొదుపురేట్లు పడిపోవడం, వ్యవసాయ వేతనాలపై కోవిడ్ 19 (Covid19) ప్రభావం
- సవాళ్లు స్వల్పకాలికమేనని గోల్డ్ కౌన్సిల్ అంచనా. పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో డిమాండ్(Gold Demand)ఊపందుకునే అవకాశం
- 2022 నాటికి బంగారానికి భారీగా పెరగనున్న డిమాండ్, బంగారం ధర, రుతు పవనాలు, పన్నుల్లో మార్పులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారంపై స్వల్పకాలిక ప్రభావం
- దీర్ఘకాలిక డిమాండ్‌కు దారితీయనున్న గృహ ఆదాయం, పసిడిపై పన్నులు
Also read: Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మారనుందా, రీబ్రాండ్ చేసే యోచనలో ఫేస్‌బుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి