Fruits to Cure Cold & Flu: జలుబు మరియు జ్వరం తగ్గించే 5 రకాల పండ్లు

జలుబు మరియు జ్వరం  వంటి చిన్న చిన్న వ్యాధులు వాతావరణ మార్పులు మరియు అనారోగ్య కారణాల వలన కలుగుతాయి. వీటిని తగ్గించటానికి అల్లోపతి మందులు అవసరం లేదు, ఇక్కడ తెలిపిన పండ్లు జలుబు మరియు జ్వరంను సులభంగా తగ్గిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 05:03 PM IST
  • ఆపిల్ పండ్లు, యాంటీ ఆక్సిడెంట్ లచే నిండి ఉంటాయి.
  • బొప్పాయిపండు విటమిన్ 'C' ని పుష్కలంగా కలిగి ఉంటుంది.
  • క్రాన్బెర్రీస్ మంచి బ్యాక్టీరియా స్థాయిలను పెంచుతాయి
  • అరటిపండు, విటమిన్ 'B6' ను పుష్కలంగా కలిగి ఉంటాయి.
Fruits to Cure Cold & Flu: జలుబు మరియు జ్వరం తగ్గించే 5 రకాల పండ్లు

Fruits to Cure Cold & Flu: జలుబు మరియు జ్వరం తగ్గించే 5 రకాల పండ్లు: పండ్లు హానికర బ్యాక్టీరియాలను చంపే గుణాలను మరియు సమర్థవంతంగా రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పండ్లు పుష్కలంగా విటమిన్ లను కలిగి ఉండి, జలుబు మరియు జ్వరాన్ని కలుగ చేసే కారకాలను వ్యతిరేఖంగా పని చేస్తాయి. వీటితో పాటుగా, రోజు పండ్లు తినటం వలన గుండె వ్యాధులు మరియు క్యాన్సర్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. జలుబు మరియు జ్వరాన్ని సమర్థవంతంగా తగ్గించే పండ్ల గురించి కింద తెలుపబడింది.

ఆపిల్
ఆపిల్ లో శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. ఒక ఆపిల్ నుండి యాంటీ ఆక్సిడెంట్ లతో పాటూ, 1,500 మిల్లి గ్రాముల విటమిన్ 'C'ని పొందవచ్చు. ఆపిల్ ఫ్లావనాయిడ్ లను కలిగి ఉండి, గుండె సంబంధిత వ్యాధులను మరియు క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది.

Also Read: IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది

బొప్పాయి పండు
250 శాతం విటమిన్ 'C' యొక్క RDA కలిగి ఉండి, జలుబు మరియు దగ్గును దూరంగా ఉంచుతుంది. వీటిలో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్ 'C'లు, శరీరంలో కలిగిన ఇన్ఫ్లమేషన్ లను పూర్తిగా తొలగిస్తుంది. వీటితో పాటుగా, ఆస్తమా స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

కాన్బెర్రీలు
ఇతర పండ్లు మరియు కూరగాయలతో పోలిస్తే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. బ్రోకలీని 5 సార్లు తీసుకోవటం వలన కలిగిన ఫలితం, కాన్బెర్రీని  ఒక్కసారి తీసుకోవటం వలన కలిగే ఫలితం సమానం. సహజ ప్రోబయోటిక్ లను కలిగి ఉన్న కాన్బెర్రీలు ఇతర అనారోగ్యాలను కలుగ చేసే బ్యాక్టీరియాల నుండి కాపాడతాయి.

ద్రాక్ష పండ్లు
లిమోనాయిడ్స్ అనే సహజ సమ్మేళనం, ద్రాక్ష పండ్లలో కనుగొనబడింది. ఇవి శరీర కొవ్వు పదార్థాలను తగ్గించుటలో భాద్యత వహిస్తాయి. విటమిన్ 'C' లను పుష్కలంగా కలిగి ఉన్న ద్రాక్ష పండ్లు, లైకోపీన్ వలే వ్యాధికారకలతో పోరాడుతాయి.  

Also Read: Navratri 2021: దేవీ నవరాత్రుల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

అరటిపండు
విటమిన్ 'B6' ను పుష్కలంగా కలిగి ఉండే ఈ పండ్లు, అలసట, డిప్రెషన్, ఒత్తిడి మరియు ఇన్సొమ్నియా (నిద్రలేమి) వంటి సమస్యలను తగ్గిస్తాయి. మెగ్నీషియంతో నిర్మితమైన ఈ పండ్లు, ఎముకలను దృడంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే పొటాషియం, అధిక రక్త పీడనాన్ని తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News