Aryan Khan: డ్రగ్స్ కేసు(Drugs case)లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు..నిషేదిత డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) కూడా ఉన్నారు.
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ముంబయి కోర్టు(Mumbai court) నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. ఇటీవల తన కొడుకును కలవడానికి షారుఖ్ కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి కోరగా ఇందుకు ఎన్సీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Aryan Khan: షారుక్ తనయుడికి బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..
బాధపడ్డ షారుఖ్
ఈ క్రమంలో లాకప్‌లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లాడు షారుఖ్. అయితే తండ్రిని చూడగానే ఆర్యన్ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. కొడుకును అలాంటి దుస్థితిలో చూసి షారుఖ్ సైతం తల్లడిల్లిపోయినట్లు సమాచారం. అధికారులు రైడ్ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్‌లో పెట్టడాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట షారుఖ్.
క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 5 గ్రాముల మెఫెడ్రోన్‌తో పాటు కొన్ని పిల్స్‌ను అలాగే రూ.1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌తో సహా మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక, విక్రాంత్ చోకర్, మొహక్ జైస్వాల్ తదితరులను అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook