Elon Musk could be forced to pay $9.4 billion as part of an investor lawsuit claiming he interfered in SolarCity deal: టెక్ ప్రపంచం రారాజు ఎలన్ మస్క్‌కి (Elon Musk) భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. అది కూడా సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది. సోలార్ సిటీ చైర్మన్ (solar city chairman) పదవిలో కొనసాగుతున్న మస్క్ అందులో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. అయితే భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఒక ఇన్వెస్టర్ ఎలన్‌మస్క్ (Elon Musk) మీద కోర్టుకు ఎక్కారు. ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల ($9.4 billion) భారీ జరిమానా ఎలన్‌మస్క్ చెల్లించాలి.
Also Read : Samantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం
సోలార్సిటీకి (solar city) సంబంధించిన ఒక ఇన్వెస్టర్ ఎలన్‌మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. ఎలన్‌మస్క్ షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, అనుమతి లేకుండానే సుమారు 2.6 బిలియన్ డాలర్ల ($2.6 billion) డీల్ ఒకటి కుదుర్చుకున్నాడని ఆ ఇన్వెస్టర్ ఆరోపిస్తున్నారు. అలాగే కంపెనీలో షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గించడమేకాకుండా, లాభాలన్నీ కూడా ఎలన్‌మస్క్ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని దావా వేసిన షేర్‌హోల్డర్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఇన్వెస్టర్ (investor) దావాకు మిగతా షేర్ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించారు. ఇక ఆ ఇన్వెస్టర్ చెప్పిందంతా రుజువులతో నిజమైతే మాత్రం ఎలన్‌మస్క్ 9.4 బిలియన్ డాలర్ల ($9.4 billion) జరిమానా అంటే దాదాపు రూ.70 వేల కోట్లదాకా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
అయితే గతంలో సోలార్ సిటీలో ఎలన్‌మస్క్ స్టాక్ షేర్ 2.4 మిలియన్గా ఉండేది. స్టాక్స్ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్‌కు చేరుకుంది. దీంతో ఎలన్‌మస్క్ షేర్ విలువ 9.56 బిలియన్ డాలర్లగా ఉంది. టెస్లా సీఈవో (Tesla CEO) హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఎలన్‌మస్క్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. అలాగే సోలార్ సిటీ స్టాక్ హోల్డర్స్‌ను మస్క్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడట. దీంతో 2017లో టెస్లా షేర్ హోల్డర్స్ అంతా కలిసి మస్క్ మీద దావా కూడా వేశారు. అంతేకాదు కంపెనీలో తన కుటుంబ సభ్యుల్ని మాత్రమే ప్రోత్సహించడం, అధిక వాటాను తానే లాగేసుకోవడం, సమర్థవంతులందరినీ పక్కకు తోసేయడం లాంటివి కూడా ఎలన్‌మస్క్ (Elon Musk) చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read : Heli Tourism Rides: దసరాకు మరో ప్రత్యేక ఆకర్షణ, తొలిసారిగా హెలీ రైడ్స్ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook