YS Sharmila meeting with Prashanth Kishore: హైదరాబాద్: వైఎస్ షర్మిలతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ స్థాపించిన అనంతరం అడపాదడపా దీక్షలు, నిరసనలు, బహిరంగ సభలతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మరో రెండేళ్లలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో ఇప్పటి నుంచే పార్టీని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకెళ్లాలని భావించిన వైఎస్ షర్మిల అందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయం కోరినట్టు ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నేడు లోటస్ పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో (YSRTP office) వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ పీఆర్ టీమ్ భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం ప్రజలకి చేరువ చేయడం వంటి అంశాలపై వైఎస్ షర్మిల (YS Sharmila), ప్రశాంత్ కిషోర్ టీమ్ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.
Also read : Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేత
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ సహాయం తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ వైఎస్సార్సీపీ కోసం సేవలు అందించిన తరహాలోనే తెలంగాణలో వైఎస్సార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) సేవలు అందించనున్నారని వినికిడి.
ఇదిలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ (Huzurabad bypolls schedule) వెలువడిన నేపథ్యంలో హూజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి అనే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
Also read : Disha Encounter-Sajjanar: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook