AP Polycet 2021: ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఇలా..

ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలో గల ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాలిసెట్- 2021 ఫలితాలను విడుదల చేశారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 02:44 PM IST
  • ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల
  • 94.20 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  • ఇద్దరికి మెుదటి ర్యాంకు
AP Polycet 2021: ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్  చెక్ చేసుకోండి ఇలా..

AP Polycet 2021 Results : ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్‌) ఫలితాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి(Gowtham Reddy) విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.

పాలిసెట్-2021(AP Polycet 2021) రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌(Official Website)లో చెక్ చేసుకోవచ్చు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని మంత్రి పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.

Also Read: TTD Members List: రెండు మూడు రోజుల్లో సిద్ధం కానున్న టీటీడీ పాలక మండలి జాబితా

మంత్రి మాటల్లో..
వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పాలిటెక్నిక్‌(Polytechnic‌)లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా  81 వేల మందికి రూ. 128 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ. 54 కోట్లు విద్యార్థులకు అందించామన్నారు. ‘‘కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారు. ఆ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది’’ అని గౌతమ్‌రెడ్డి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News