Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్ గాయకుడి అవతారమెత్తారు. ఇదంతా ఏ సినిమా కోసమో అనుకుంటే పొరపాటే. సోమవారం శ్రీనగర్(Sri nagar)లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(Information Technology Parliamentary Standing Committee)కి ప్రాతినిధ్యం వహించారాయన. ఈసందర్భంగా.. దూరదర్శన్ శ్రీనగర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. అలనాటి బాలీవుడ్(Bollywood) క్లాసిక్.. 1974లో విడుదలైన ‘‘అజ్‌నబీ’’ చిత్రం నుంచి ‘‘ఏక్ అజ్‌నబీ హసీనా సే'(Ek Ajnabee Haseena Se)’’ అనే పాటను ఆలపించారు.
Also Read: Bigg Boss Today's Promo: నామినేషన్స్ స్టార్ట్... నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో...!!
ఈ పాట ఒరిజినల్‌ను గాయకుడు కిశోర్‌కుమార్(Kishore Kumar) పాడగా ఇందులో హీరోహీరోయిన్లుగా రాజేష్ ఖన్నా(Rajesh Khanna), జీనత్ అమన్ నటించారు. '' ఏమాత్రం ప్రాక్టీస్ చేయకుండా.. ఎంజాయ్ చేస్తూ పాడా'' అంటూ ట్విటర్(Twitter)లో రాసుకొచ్చారు. ఫొన్‌లో లిరిక్స్ చూస్తూ చక్కటి హావభావాలు ఇస్తూ పాడుతూ ప్రేక్షకులను అలరించారాయన. ఆయన పాడటం మొదలుపెట్టగానే అందరూ సెల్‌ఫోన్లలో చిత్రీకరించడం ప్రారంభించారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే శశిథరూర్(Shashi Tharoor) తనలోని ఈ టాలెంట్ బయటపెట్టగానే ప్రశంసలు వెల్లువెత్తాయి.
After the cultural programme by Doordarshan Srinagar for the Parliamentary Standing Committee on Information Technology, I was persuaded to sing for the Members. Unrehearsed and amateur but do enjoy! pic.twitter.com/QDT4dwC6or
— Shashi Tharoor (@ShashiTharoor) September 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook