Scary Video: పైకప్పులోంచి వేలాడుతున్న "దెయ్యం తల"...తరువాతేం జరిగింది?? (Video)

సినిమాలో చూపించిన విధంగా పైకప్పుకు దెయ్యం తల వేలాడుతూ కనపడితే..? అలాంటి సన్నివేశం ఎదురైతే... ?? ఇలాంటి సంఘటనే ఒకటి చైనాలో జరిగింది.. కానీ దెయ్యం కాదు.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ? అయితే ఒకసారి చూసేయండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 03:40 PM IST
  • సోషల్ మీదిలో తెగ వైరల్ అవుతున్న వీడియో
  • పైకప్పుకు వేలాడుతున్న తల
  • వేలాడుతుంది దెయ్యం కాదు తన కూతురే..!
Scary Video: పైకప్పులోంచి వేలాడుతున్న "దెయ్యం తల"...తరువాతేం జరిగింది?? (Video)

Scary Viral Video: సోషల్ మీడియాలో (Social Media) ఒక వీడియో తెగ వైరల్ (Viral) అవుతుంది, ఎందుకంటే, సినిమాలో చూపించిన విధంగా ఒక దెయ్యం తల పైకప్పులో నుండి వేలాడుతూ కనిపించటం.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? నిజంగా నిజమే...

వివరాల్లోకి వెళ్తే చైనాలో (China) ఒక వ్యక్తి  తన ఇంట్లో ఉన్న ఒక గదిలో ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్ ఫిట్ చేయటానికి కావాల్సిన పనిముట్లతో రూమ్ లోకి వెళ్ళాడు.. ఫిట్ చేద్దాం అని పైకి చూసే సరికి.. అతడికి ఒళ్లు గగ్గోర్లు పొడిచే సంఘటన ఒకటి కనపడింది. ఒక తల పైకప్పు నుండి జుట్టుతో కిందకి వేలాడుతూ ఉన్నట్టు కనపడింది.. అంతే.. ఇంకేం ఉంది గుండె ఆగినంత పనైంది..

Also Read: Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!

నిశితంగా పరిశీలించిన తరువాత ఆ వ్యక్తికి అర్థం అయింది.. వేలాడుతూ కనపడుతుంది దెయ్యం తల (Ghost Head) కాదు తన కూతురి తలే అని.. ఇంకేం ఉంది.. కంగారు పడ్డ అతడు.. అరిచి ,చుట్టూ పక్కల వారిని సాయంగా పిలిచాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన చైనాలోని (China) గుయిజోకు చెందిన పుడ్డింగ్ కౌంటీలో ఒక ఇంట్లో జరిగింది.

నిజానికి గదిలో ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్ బిగించడం కోసం 8 అంగుళాల రంధ్రం చేయించాడు యజమాని. రంధ్రం ఎందుకు చేసారో అని తెలియని ఆ చిన్నారి అందులోంచి తొంగి చూసింది.. అంతే ఆ రంధ్రంలో తల ఇరుక్కుపోయింది. తల భయటకు తీయటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆ చిన్నారి తండ్రి చూసి, బయటకు తీయటానికి అన్ని రకాల ప్రయాత్నాలు చేసాడు. చేసేదేమీ లేక అగ్నిమాపక దళానికి ఫోన్ చేసాడు. వారు కాస్త సమయం వరకు ప్రయత్నించి... ఏదోలా అమ్మాయిని బయట పడేలా చేసి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News