PG Medical New Courses: జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు, కొత్త పీజీ కోర్సుల వివరాలు ఇవే

PG Medical New Courses: దేశంలో కొనసాగుతున్న వైద్య విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కోర్సులు, కొత్త వైద్య విధానం పరిచయమవుతోంది. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా జాతీయ మెడికల్ కమీషన్ మార్పులు తీసుకొస్తోంది. ఆ మార్పులిలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2021, 02:08 PM IST
  • జాతీయ వైద్య విధానంలో కొత్త మార్పులు, కొత్త కోర్సులు
  • పీజీ మెడికల్ ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో కొత్తగా 4 కోర్సులు, 8 సూపర్ స్పెషాలిటీ కోర్సులు
  • చిన్నారులకు పీడియాట్రిక్స్‌లా కొత్తగా వృద్ధుల కోసం జీరియాట్రిక్స్ కోర్సు
PG Medical New Courses: జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు, కొత్త పీజీ కోర్సుల వివరాలు ఇవే

PG Medical New Courses: దేశంలో కొనసాగుతున్న వైద్య విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కోర్సులు, కొత్త వైద్య విధానం పరిచయమవుతోంది. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా జాతీయ మెడికల్ కమీషన్ మార్పులు తీసుకొస్తోంది. ఆ మార్పులిలా ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం అమలవుతున్న జాతీయ వైద్య విధానం(National Medical Policy), మెడికల్ కోర్సుల్లో కొత్త మార్పులు వస్తున్నాయి. జాతీయ మెడికల్ కమీషన్(National Medical Commission) శాస్త్రీయంగా, సామాజిక అవసరాలకు తగ్గట్టుగా కోర్సుల్ని డిజైన్ చేసింది. దేశంలో 20 ఏళ్ల తరువాత జాతీయ వైద్య విధానం, మెడికల్ కోర్సుల్లో ఈ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పీజీ మెడికల్ కోర్సుల్లో కీలకమార్పులు చేశారు. మరోవైపు మెడికల్ కళాశాలల్లో వైద్య పరిశోదనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఉన్న నిబంధనల్ని సులభం చేస్తూనే కొత్తగా మార్పులు సూచించింది.

ఇందులో భాగంగా పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్‌లానే వృద్ధుల కోసం జీరియాట్రిక్స్(Geriatric Course) స్పెషలైజేషన్ కోర్సు ప్రవేశపెడుతున్నారు. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతుండటం, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, వృద్ధులకు నాణ్యమైన జీవితాన్ని అందించే విధంగా ఈ కోర్సుల్ని తీర్దిదిద్దనున్నారు. ప్రస్తుతం పీజీ ఎండీ, ఎంఎస్‌లో 32 కోర్సులున్నాయి. కొత్తగా మరో 4 కోర్సులు ప్రవేశపెడుతున్నారు. సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం ఉన్న 38 కోర్సులకు అదనంగా మరో 8 కోర్సుల్ని ప్రారంభించనున్నారు. వైద్యరంగంలో నైతిక విలువలప ప్రత్యేకంగా ఎటువంటి కోర్సు లేకపోవడంతో ఇప్పుడు కొత్తగా పీజీ మెడికల్‌లో ఐసీఎంఆర్ నిర్వహించే మెడికల్ ఎథిక్స్ సర్టిఫికేట్ కోర్సు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాదిలోనే ఈ కోర్సు పూర్తి చేయాలి, లేకపోతే ఫైనలియర్ పరీక్ష రాసే అర్హత కోల్పోతారు. ఒక వైద్యుడు మరో వైద్యుడి గురించి చెడుగా చెప్పకూడదు. కమీషన్ల కోసం ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం నిషిద్ధం. వైద్యులు, రోగుల మధ్య సంబంధాలపై మానవీయ కోణాన్ని పెంపొందించేవిధంగా కోర్సు ఉంటుంది. 

పీజీ మెడికల్‌లో తొలి యేడాది ఐసీఎంఆర్(ICMR) నిర్వహించే బేసిక్ బయో మెడికల్ రీసెర్చ్ కోర్సు ఆన్‌లైన్‌లో చదివి రాయాలి. బేసిక్ లైఫ్ సపోర్ట్‌పై అన్ని ప్రత్యేక కోర్సుల్ని వైద్య విద్యార్ధులకు తప్పనిసరి చేశారు. అత్యవసర వైద్యం అందరూ నేర్చుకోవల్సిందే. గతంలో పీజీ మెడికల్ లో మొదటి ఏడాది, రెండవ ఏడాది మాత్రమే పరీక్ష ఉండేది. ఇప్పుడు కోర్సు 50 మాడ్యూల్స్‌గా విభజిస్తారు. ఆ ప్రకారం పరీక్షలు జరుగుతాయి. పీజీ మెడికల్ విద్యార్ధులు జిల్లా ఆసుపత్రుల్లో తప్పనిసరిగా 3 నెలలు చేయాల్సి ఉంటుంది. పీజీ సీట్ల మంజూరులో కొత్త విధానం అమలు కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలు పీజీ కోర్సుల్ని ప్రారంభించాలంటే..తప్పనిసరిగా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వ్యవస్థ సొంతంగా ఉండాలి. 

పీజీ ఎంస్ , ఎండీలో(PG New Medical Courses) కొత్తగా జీరియాట్రిక్స్, ఏరోస్పేస్ మెడిసిన్, మెరైన్ మెడిసిన్, ట్రమలాలజీ అండ్ సర్జరీ కోర్సుల్ని ప్రవేశపెట్టారు. ఇక సూపర్ స్పెషాలిటీ(Super Speciality) విభాగంలో కొత్తగా మెడికల్ జెనెటిక్స్, వైరాలజీ మెడిసిన్, ఛైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ, జీరియాట్రిక్ మెంటల్ హెల్త్, హెపటాలజీ, ఎంసీహెచ్ ఎండోక్రైన్ సర్జరీ, హెపటో పాంక్రియాట్రో బిలియరీ సర్జరీ, రీ ప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుల్ని పరిచయం చేస్తున్నారు. 

Also read: India Corona Update: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కేరళలో పరిస్థితి ఆందోళనకరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News