Arshi khan: అఫ్గానిస్థాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోవటంతో...అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం కారణంగా..ఆ దేశ క్రికెటర్ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్షిఖాన్.
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్(Arshi khan) తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఓ అఫ్గనిస్తాన్ క్రికెటర్(Afghan Cricketer )తో ఈ ఏడాది అక్టోబర్‌లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. ఆ అబ్బాయిని మా నాన్న సెలక్ట్ చేశారు. సదరు క్రికెటర్ మా నాన్న స్నేహితుడి కుమారుడు. కానీ తాలిబన్లు(Talibans) అఫ్గన్‌ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని(Engagement) రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది.. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు''’’ అని తెలిపారు.
Also Read: The Afghanistan crisis: ప్రపంచాన్ని కదలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ పిల్లల దృశ్యాలు
అయితే ఈ ఇంటర్వ్యూలో అర్షి ఖాన్(Arshi khan) తన అఫ్గనిస్తాన్(Afghanistan) మూలాల గురించి కూడా చెప్పింది. ''తాను అఫ్గనిస్తాన్ పఠాన్(Pathans)ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్‌లో జైలర్‌గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి.. అయినప్పటికి నేను భారతీయ పౌరురాలినే" అన్నారు అర్షి ఖాన్. ఇక ఆమె 4వ ఏట ఉన్నప్పుడు అర్షి ఖాన్ తల్లిదండ్రులు అఫ్గన్ నుంచి ఇండియా(India)కు వలస వచ్చారు.
అర్షి ఖాన్(Arshi khan) బిగ్ బాస్ సీజన్ 11(Bigg Boss 11)లో పాల్గొన్నారు. ఆ తర్వాత 14వ సీజన్లో ఛాలెంజర్‌గా షోలో తిరిగి ప్రవేశించారు. అర్షి 'సావిత్రి దేవి కాలేజ్ అండ్ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించారు. ఇదేకాక 'రాత్ కి రాణి బేగం జాన్', 'ది ఈవిల్ డిజైర్స్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook