Flying Car: ప్రపంచం ఇప్పుడు ఫ్లైయింగ్ కార్ల కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మేకిన్ ఇండియా చెన్నైకు చెందిన కంపెనీ మాత్రం అక్టోబర్‌లోనే ఫ్లైయింగ్ కారు సిద్ధం చేసేలా కన్పిస్తోంది.
దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ (Electric Vehicles Trend)నడుస్తోంది. అయితే అదే సమయంలో ఫ్లైయింగ్ కార్ల కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఫ్లైయింగ్ కార్లకు సంబంధించి యూరప్, అమెరికా కంపెనీలదే పైచేయిగా ఉంది. ఆసియా నుంచి హ్యుండయ్ సంస్థ ఫ్లైయింగ్ కార్ల టెక్నాలజీపై పరిశోధనలు కూడా చేస్తోంది. అయితే మేకిన్ ఇండియా కంపెనీ, చెన్నైకు చెందిన వినత ఎయిరో మొబిలిటీ సంస్థ సంచలనం రేపనుంది. చెన్నైకు చెందిన ఈ కంపెనీ ఫ్లైయింగ్ కార్ల తయారీలో కీలక ఘట్టాన్ని దాటేసింది.ఫ్లైయింగ్ కారు డిజైన్ పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ సవ్యంగా సాగితే..2021 అక్టోబర్ 5న లండన్‌లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు సిద్ధంగా ఉండనుంది.
వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ నిర్మిస్తున్న ఫ్లైయింగ్ కారు( Flying Car)బరువు 11 వందల కేజీలుండి..13 వందల కిలోల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్‌గా టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఈ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఏర్పాటైంది. బయో ఫ్యూయెల్ సహాయంతో ఈ కారు ఎగురుతుంది. అవసరమైతే ఎలక్ట్రిక్ ఎనర్జీను ఉపయోగించుకుంటుంది. ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సెల్ క్వాడ్ రోటర్ ఏర్పాటు చేస్తున్నారు. కారు ప్యానెల్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వినియోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ కారు నేల నుంచి 3 వేల అడుగుల ఎత్తు వరకూ ప్రయాణించగలదు. ఒకసారి ఫ్యూయెల్ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణించగలదు. గంటకు 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదు. అక్టోబర్ నాటికి ఫ్లైయింగ్ కారు సిద్ధం కానుంది.
Also read: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ ఇకపై నో ఫ్లై జోన్, విమాన ప్రయాణం నిషిద్దం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook