Marburg virus: రెండేళ్లుగా కరోనా వైరస్(Covid) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వ్యాక్సిన్ల్ వచ్చినా ఇంకా అదుపులోకి రాని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరో కొత్త వైరస్ కలవరపెడుతోంది. అదే మార్ బర్గ్ వైరస్.
ఆఫ్రికా(Africa) దేశం గినియాలో మార్బర్గ్(Marburg virus) అనే వ్యాధి తాజాగా బయటపడింది.ఈ వ్యాధి బారిన పడి ఓ వ్యక్తి మరణించాడు. ఎబోలా(Ebola), కోవిడ్ లాంటి వైరస్ల తరహాలోనే మార్బర్గ్ కూడా ప్రాణాంతమైందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తోంది.
Also Read: డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌కు అవకాశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ఆగస్టు 2న గినియా(Guinea) దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్లో మరణించిన రోగి నుంచి సేకరించిన నమూనాలలో ఈ ప్రాణాంతక వైరస్ కనుగొన్నట్లు డబ్ల్యూహెచ్ఓ(WHO) తెలిపింది. గబ్బిలాల(Bats) ద్వారా సోకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, ఈ వ్యాధి సోకితే 88% వరకు మరణాల రేటు ఉంటుందని స్పష్టం చేసింది. ఎబోలా వైరస్ లక్షణాలు కలిగిన ఈ వైరస్ కోవిడ్-19 మాదిరిగానే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపింది.
మార్బర్గ్ వైరస్(Marburg virus) చాలా ప్రమాదకరమైందని, ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తొలి దశలోనే నిలువరించాలని ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయిటి పేర్కొన్నారు. గినియాలో గతేడాది ఎబోలా(Ebola Virus) వైరస్ సోకి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వైరస్‌ను అరికట్టిన కొద్ది నెలల్లోనే మార్బర్గ్ వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ కనుగొనడం ఇదే మొదటిసారని డబ్ల్యూహెచ్ఓ(WHO) పేర్కొంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం ఈ వైరస్ లక్షణాలని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook