Starlink: బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ప్రవేశించిన ప్రముఖ వాణిజ్యవేత్త ఎలన్ మస్క్ కొత్త ఘనత సాధించారు. స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ మెరుపు వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తూ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలందించేందుకు ఎలన్ మస్క్(Elan Musk)ప్రారంభించిన స్పేస్‌ఎక్స్(SpaceX) స్టార్‌లింక్ అరుదైన ఘనత సాధించింది. ఏకంగా శాటిలైట్ ఆధారంగా ఇంటర్నెట్ సేవలందిస్తోంది. అమెరికా సహా 11 దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి.సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి.ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్టవేగంతో ఇంటర్నెట్ అందిస్తోంది. తాజాగా స్పీడ్ టెస్ట్‌లో స్టార్‌లింక్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలోని హ్యూస్‌నెట్, వియాసత్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పోలిస్తే స్టార్‌లింక్ ప్రధమ స్థానంలో ఉంది.
స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్(Starlink Broadband)సరాసరిన 97.23 ఎంబీపీఎస్ స్పీడు అందిస్తుండగా..హ్యూస్‌నెట్ సంస్థ 19.73 ఎంబీపీఎస్ వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. వియాసత్ 18.13 ఎంబీపీఎస్ స్పీడుతో మూడవ స్థానంలో ఉంది. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ గరిష్టంగా 139.39 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందించినట్టు రికార్డైంది. ఇక అప్‌లోడింగ్‌లో కూడా స్టార్‌లింక్ రికార్డు సాధించింది. ఇందులో స్టార్‌లింక్ 15.99, 17.18 ఎంబీపీఎస్ స్పీడు అందించగా..పోటీ కంపెనీలైన హ్యూస్‌నెట్ 2.43 ఎంబీపీఎస్, వియాసత్ 3.38 ఎంబీపీఎస్ స్పీడు నమోదు చేశాయి. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్‌లోని ఉపగ్రహాలు లోఎర్త్ ఆర్బిట్ కలిగి ఉండటం ద్వారా ఈ వేగం సాధ్యమైందని తెలుస్తోంది.
Also read: డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌కు అవకాశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook