25 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాని వారి సొంత గడ్డపై భారత క్రికెట్ జట్టు ఓడించిన క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, జట్టు సారథి విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా సెల్ఫీ ఇంటర్వ్యూ చేశారు. వారి ఇంటర్వ్యూని ట్విట్టర్ వేదికగా బీసీసీఐ ప్రత్యేకంగా పంచుకొంది. ఈ సిరీస్‌లోనే రోహిత్ శర్మ తన 17వ సెంచరీని నమోదు చేశాడు. అలాగే కోహ్లీ కూడా పలు రికార్డులు తిరగరాశాడు.
ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఇంటర్వ్యూలో రోహిత్, కోహ్లీని ప్రశ్నిస్తూ.. 25 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాని వారి సొంత గడ్డపై ఓడించడం పై మీ కామెంట్ ఏమిటి అని అడగగా.. విరాట్ దానికి సమాధానం ఇచ్చారు. అది అద్భుతమైన ఫీలింగ్ అని.. ఇది కచ్చితంగా టీమ్ ఐకమత్యం వల్ల సంభవించిన విజయమని పేర్కొన్నారు. అయితే ఈ విజయంలో రోహిత్ పాత్ర కూడా చాలా అత్యుత్తమైనదని ఆయన తెలిపారు.
అలాగే దక్షిణాఫ్రికా పై గెలవడం అంత సులువైన విషయం కాదని.. తాను కూడా ఈ సిరీస్‌లో ఎంతో ఒత్తిడికి గురయ్యానని రోహిత్ తెలిపాడు. ఇంత ఒత్తిడిలో ఆడిన టీమిండియా ఆట పరంగా ఎలా మెరుగుపడిందని అడిగిన రోహిత్ ప్రశ్నకు కూడా కోహ్లీ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు నిజంగానే తమ ప్రతిభ ద్వారా జట్టుని ఆదుకున్నారని కోహ్లీ తెలిపారు.
ముఖ్యంగా బూమ్రా, భువనేశ్వర్‌లతో పాటు హార్దిక్ పాండ్య కూడా జట్టు కోసం కష్టపడిన తీరు తనకు నచ్చిందని కోహ్లీ అన్నాడు. వారు లేకపోతే దక్షిణాఫ్రికాని ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేదని ఆయన అన్నారు. అలాగే బ్యాట్స్మన్లు కూడా టీమ్‌కు విశేషంగా సహకరించడం వల్లే జట్టు విజయం సాధించిందని.. మొత్తానికి ఇది టీమ్ విజయం అని కోహ్లీ అన్నారు.
VIDEO: In a kind of firsts, Man of the moment - @ImRo45 did a quick selfie interview for https://t.co/Z3MPyeKtDz with captain @imVkohli post India's first series win in South Africa. Listen in to what the duo had to say about the historical moment.https://t.co/UE7ofNQMid#SAvIND pic.twitter.com/TY2Ik1Tmha
— BCCI (@BCCI) February 14, 2018