Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు ముంచెత్తనున్నాయి.
రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయి. ఓ వైపు పశ్చిమ, నైరుతి రుతు పవనాలు మరోవైపు అల్పపీడన ద్రోణి బలహీనపడటం వల్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతు పవనాలు ఉత్తర భారత దేశాన్ని దాటలేకపోతున్నాయని..పశ్చిమ ప్రాంతాలకు వ్యాపించడం లేదని ఐఎండీ తెలిపింది. అందుకే రాజస్థాన్, ఢిల్లీ, యూపీ,చండీగఢ్, హర్యానాలలో ఇంకా వర్షాలు మొదలు కాలేదని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాదిలో మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో మాత్రం కుండపోతగా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రానున్న మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(IMD)స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: AP Government: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలపై హై పవర్ కమిటీ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook