House Collapses in River: అకస్మాత్తుగా కురిసే వర్షాలు లోతట్టు ప్రాంతాల వారికి నరకప్రాయంగా మారతాయి. ముఖ్యంగా నదులు, కాలువల వెంట నివాసం ఉండే ప్రాంతాలలో అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము. వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయి నదిలో పడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిహార్ రాష్ట్రంలో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తూర్పు చంపారన్ జిల్లాలోనూ పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. చంపారన్ జిల్లా కేంద్రం మోతిహరిలో ఓ ఇల్లు వర్షానికి కూలిపోయింది. వర్షాల కారణంగా బురి గండక్ నదికి ప్రవాహం అధికమైంది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మోతిహరిలోని భవానీపూర్ ఏరియాలో భూమి కోతకు గురైంది. ఓ ఇల్లు క్షణాల వ్యవధిలో కూలిపోయి నదిలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ (Viral Video) అవుతోంది. జాతీయ మీడియా ఏఎన్ఐ సైతం ఈ వీడియో వివరాలు షేర్ చేసింది.
#WATCH | Bihar: A house collapses in Bhawanipur, Motihari as incessant rainfall leads to a rise in water level of Sikrahna (Burhi Gandak) river, leading to soil erosion at river banks. The house was damaged due to heavy rainfall and unoccupied at the time of the incident. pic.twitter.com/JVRwcnr9xI
— ANI (@ANI) July 4, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook