Chardham Yatra: ప్రతిష్ఠాత్మక చార్‌థామ్ యాత్రకు బ్రేక్ పడింది. చార్‌థామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.
ఉత్తరాఖండ్ (Uttarakhand)రాష్ట్రంలోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్ధామ్ యాత్రను పాక్షికంగా తెరవాలని రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉత్తరాఖండ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవాలయాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేసింది. అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్టుగా ఈ వాదన ఉందని వ్యాఖ్యానించింది.
శాస్త్రాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనల్ని ప్రసారం చేసేందుకు టెలివిజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టింది. కొంతమంది భావాల్ని పట్టించుకోవడం కంటే డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ప్రజల ప్రాణాల్ని రక్షించడం ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. 2020లో లో కూడా మొదటి వేవ్ సమయంలో చార్ధామ్ యాత్ర(Chardham yatra)ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈసారి కూడా రెండవ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో చమోలి, రుద్రప్రయోగ్, ఉత్తర కాశీ ప్రజల కోసం పరిమితంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు కేబినెట్ (Uttarakhand cabinet) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై హైకోర్టు (High Court)స్టే విధించింది. కోవిడ్ సూపర్ స్పైడర్‌గా మారకుండా యాత్రను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. దేవాలయాలతో ప్రజలకున్న మనోభావాన్ని పరిగణలో తీసుకుని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాధ్, బద్రీనాథ్‌లలో కొనసాగుతున్న కార్యక్రమాల్ని ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది.
Also read: Delta Plus Variant of Covid-19: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, అవన్నీ అపోహలే: నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook