SBI Alert: బ్యాంకింగ్ సేవల్లో డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐకు సైబర్ ముప్పు పొంచి ఉంది. అందుకే ఎస్బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది.
దేశంలో డిజిటలైజేషన్ (Digitalisation) కారణంగా ఆన్లైన్ లావాదేవీలు(Online Transactions)పెరిగిపోయాయి. ఫలితంగా రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐకు సైబర్ ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఎస్బీఐ ఖాతాదారులను (SBI Customers) అప్రమత్తం చేసింది.సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. విలువైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవచ్చని ఎస్బీఐ (SBI) స్పష్టం చేసింది. ఆన్లైన్లో ఎలాంటి సున్నితమైన వివరాల్ని పంచుకోవద్దని..ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవద్దని పేర్కొంది.
బర్త్ డే, డెబిట్ కార్డు నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాల్ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసుల కేవైసీ అధారిటీ పేరుతో చేసే ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.ప్లే స్టోర్ కాకుండా టెలిఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ఆధారంగా ఏ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని కోరుతోంది. తెలియని మూలాల్నించి వచ్చిన మెయిల్స్‌లో ఉండే అటాచ్‌మెంట్స్‌పై అస్సలు క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తోంది. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆకర్షణీయమైన, అపరిచతి ఆఫర్లకు స్పందించవద్దని ఎస్బీఐ ( SBI) తెలిపింది.
Also read: Covaxin Price: వ్యాక్సిన్ ధరలపై స్పష్టత ఇచ్చిన భారత్ బయోటెక్, ప్రైవేటురంగంలో వ్యాక్సిన్ ధర అంతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook