Govt employees salary hike: పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ.. పెరగనున్న జీతాలు

PRC for Telangana govt employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పీఆర్సీ అమలుకు ఆమోదం తెల‌ప‌గా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2021, 07:59 AM IST
Govt employees salary hike: పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ.. పెరగనున్న జీతాలు

PRC for Telangana govt employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పీఆర్సీ అమలుకు ఆమోదం తెల‌ప‌గా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పెంచిన పీఆర్సీని జూన్ నెల వేతనాల్లో కలిపి చెల్లించాల‌ని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. నోషనల్ బెనిఫిట్​ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్​ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్​ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ (PRC for TS govt employees) వర్తించనుంది. 

Also read : PRC approved: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు Good news.. పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

ఉద్యోగుల కనీస వేతనం (Basic salary) రూ. 19 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగిస్తున్నట్టు స్పష్టంచేసింది. ఇప్పటివరకు రూ. 12 లక్షలుగా ఉన్న రిటైర్మెంట్ గ్రాట్యుటీని 16 లక్షలకు పెంచింది. అలాగే పెన్షనర్ల (Pensioners) మెడికల్ అలవెన్సులను రూ. 350 నుంచి రూ. 600కు పెంచింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం (Telangana government) నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Also read : TS Cabinet meeting important points: తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News