Covid19: కరోనా మహమ్మారి ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. దేశంలో సెకండ్ వేవ్ అంతగా విజృంభించడానికి కారణమేంటి..సంక్రమణకు కారణమైన వేరియంట్ ఏది..ఆ నివేదిక ఏం చెబుతోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దేశాన్ని కుదిపేసింది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకమైన వైరస్ కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు. దేశంలో వైరస్ ఇంతగా విజృంభించడానికి కారణమైన వేరియంట్‌పై స్పష్టత వస్తోంది. ఇండియన్ సార్స్‌కోవ్ 2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ నివేదిక ఇదే విషయం స్పష్టం చేస్తోంది. యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన బి.1.1.7 కేసులు ఇప్పుడు గత 2 నెలలుగా తగ్గిపోయాయంటోంది ఆ నివేదిక. కోవిడ్ వేరియంట్ బి.1.617 (Covid Variant B.1.617 )కేసులు తొలిసారిగా మహారాష్ట్రంలో బయటపడ్డాయని..ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణలో పెరిగినట్టు గుర్తించారు.
దేశంలో కేసులు భారీగా పెరగడానికి కారణంగా బి.1.617 వేరియంట్ కారణమని..ఇదే వేరియంట్ అనంతరం బి.1.617.1, బి.1.617.2, బి.1.617.3లుగా రూపాంతరం చెందినట్టు ఇన్సాకాగ్ నివేదిక చెబుతోంది. అటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కనీసం 7 కరోనా వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని బెనారస్ హిందూ యూనివర్శిటీ, సీసీఎంబీ(CCMB) సంయుక్త అధ్యయనంలో తేలింది. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించినట్టు సీసీసీఎంబీ తెలిపింది.
Also read: Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధతపై ప్రధాని మోదీ కీలక సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook