Retired Headmaster Kotaiah Death News : కరోనా నుంచి కోలుకునేందుకు ఆయుర్వేద మందు ఉచితంగా అందిస్తున్న ఆనందయ్యకు షాక్ తగిలింది. కరోనా చికిత్సలో భాగంగా ఆయన తయారు చేసిన మందుకు అనుమతులు రావడమే తరువాయి అనుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య మృతి చెందడం కలకలం రేపుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నా ప్రయోజనం కనిపించలేదని, కానీ ఆనందయ్య దగ్గర తీసుకున్న కంటి చుక్కల మందు (Anandayya Ayurvedic Medicine)తో రెండు నిమిషాల్లో తాను లేచి కూర్చున్నానని, ఆక్సిజన్ లెవెల్స్ సైతం పెరిగాయని రిటర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చెప్పిన వీడియో ఏపీ, తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.
Also read: Ayush Report: కృష్ణపట్నం మందుతో ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యమంత్రి చేతికి నివేదిక
Retired Head Master Kotaiah who had taken the ‘miracle’ medicine prepared by #anandayya , dies of #coronavirus in #Nellore GGH. He had taken the ‘herbal eye drop’ and his video claiming recovery from #COVID19 was viral. #AndhraPradesh #anandaiah #krishnapatnam pic.twitter.com/SbAP8TQcpW
— Aashish (@Ashi_IndiaToday) May 31, 2021
ఆనందయ్య దగ్గర కంట్లో చుక్కల మందు వేసుకున్న రెండు రోజుల తరువాత ఆరోగ్యం క్షీణించడంతో కోటయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆపై మే 22న నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కరోనా వైరస్ (Coronavirus)తో పోరాడుతూనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆనందయ్య నాటు మందును ఆయుర్వేద ఔషధంగా ప్రకటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Also Read: Corona Cases Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం, 50 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు
కాగా, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య వీడియోతోనే కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుద్వేద ఔషధానికి భారీ డిమాండ్ వచ్చింది. ఆనందయ్య కరోనా మెడిసిన్ (Anandaiah Ayurvedic Medicine) తీసుకున్నాక కోలుకున్నట్లే కనిపించినా ఆరోగ్యం మెరుగవలేదు. గత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఆనందయ్య మెడిసిన్‌కు ఆమోదం లభిస్తుందనుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. వైద్య సంస్థలు, నిపుణులు దీనిపై సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook