World No Tobacco Day 2021: నేడు వరల్డ్ నో టొబాకో డే. ప్రతి ఏడాది మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ పోగాకును నిర్మూలించే దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు వాడకం ద్వారా కలిగే దుష్ప్రరిణామాలపై ప్రజలలో అవగాహనా పెంచేందుకు ఈ రోజును నిర్వహిస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారికి స్మోకర్స్ లక్ష్యంగా మారుతున్నారు.
ధూమపానం చేసేవారిలో కోవిడ్19 బారిన అవకాశం 50 శాతం పెరుగుతుందని World No Tobacco Day 2021 సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయోసస్ తెలిపారు. కరోనా వైరస్ బారిన పడరాదంటే స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మిలియన్ల మంది ధూమపానాన్ని మానివేస్తున్నట్లు చెబుతున్నారు. తమతో పాటు కుటుంబసభ్యుల ప్రాణాలను ముప్పు బారిన పడకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా వీడియో ట్వీట్ చేసింది.
Also Read: World No Tobacco Day 2021: స్మోకింగ్ మానేస్తేనే కరోనా ముప్పును ఎదుర్కోవచ్చు, WHO
Today is #WorldNoTobaccoDay! 🚭
The #COVID19 pandemic has led to millions of tobacco users saying they want to quit.
Join communities of quitters and commit to quit today 👉https://t.co/otu6PR8BIp pic.twitter.com/e9QObUQiUL
— World Health Organization (WHO) (@WHO) May 30, 2021
పొగాకు లేని సమాజం కోసం పోరాటంలో భాగంగా తమతో చేతులు కలపాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో చీఫ్ కోరారు. ఈ అలవాటు మానేందుకుగానూ కొన్ని పరికరాలతో సహకారం అందిస్తామని చెప్పారు. భారత్‌లో ఈ సిగరెట్స్ (Smoking) మరియు హీటెట్ టొబాకో ఉత్పత్తులు నిషేధించడంతో ఆరోగ్య కుంటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్దన్‌కు, టొబాకో కంట్రోల్ రీసెర్చ్ గ్రూప్‌లకు యూకేలోని బాత్ యూనివర్సిటీలో ప్రత్యేక గుర్తింపు అవార్డులు అందించినట్లు డాక్టర్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయోసస్ గుర్తుచేశారు.
Also Read: 2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 39 శాతం పరుషులు, 9 శాతం మహిళలు ధుమపానం (Smoking) చేస్తున్నారు. యూరప్‌లో అధికంగా స్మోకింగ్ రేటు 26 శాతంగా ఉందని, అత్యవసర చర్యలు తీసుకుంటే 2 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. కోవిడ్19 బారిన పడే వారిలో ఊపిరితిత్తుల సమస్య, ఇన్ఫెక్షన్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక స్మోకింగ్ మానేయాలని దీనిపై మరింత అవగాహన పెంచాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook