2 Years Of YS Jagan Rule In AP: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృ ష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో వైఎస్సార్సీపీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఏపీ ప్రజలకు ఇవ్వగలిగామని, ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చిన తాను అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నానని చెప్పారు. దేవుని దయ, ప్రజల దీవెనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.
Also Read: Mehul Choksi: డొమినికాలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, శరీరంపై గాయాలు
ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021
ఈ రెండేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు పలు పథకాల ద్వారా నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు వారి సంక్షేమం కోసం అందించగలిగామని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే (2 Years Of YSRCP Rule) సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా వైరస్ (CoronaVirus) సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు. రాష్ట్ర పేదల బాగోగుల కోసం సీఎం అహర్నిశలూ శ్రమిస్తున్నారని, 20 ఏళ్లల్లో సాధించలేని అభివృద్ధిని రెండేళ్లలోనే ఏపీ సీఎం జగన్ చేసి చూపారని సజ్జల ప్రస్తావించారు.
Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook