Chandra Grahanam 2021: చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉంటే ప్రయోజనం

జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహణాణాన్ని శుభసూచకంగా పరిగణించరు. కనుక ఈరోజు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించారు. గ్రహణం సమయంలో పనులను సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. గ్రహణం సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉంటే చెడు సూచకలు మీ దరిచేరవని పెద్దలు చెబుతుంటారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 26, 2021, 02:11 PM IST
  • ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి
  • అందులో తొలి గ్రహణమైన చంద్రగ్రహణం నేడు ఏర్పడుతుంది
  • చంద్రగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తేనే ప్రయోజనం
Chandra Grahanam 2021: చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉంటే ప్రయోజనం

ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఉండగా, అందులో మొదటగా ఏర్పడేది చంద్రగ్రహణం. మే 26న మరికాసేపట్లో చంద్ర గ్రహణం ఏర్పడనుందిగ. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా, రెండో చంద్రగ్రహణం నవంబర్ నెలలో ఏర్పడుతుంది. నేడు సూపర్ బ్లడ్ మూన్‌ను సైతం ప్రజలు వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రడు పూర్తిగా ఎరుపు రంగులో దర్శనమిస్తే సూపర్ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. మొత్తం 5 గంటల 2 నిమిషాలపాటు గ్రహణ సమయం. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహణాణాన్ని శుభసూచకంగా పరిగణించరు. కనుక ఈరోజు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించారు. గ్రహణం సమయంలో పనులను సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. చంద్రగ్రహణం (Lunar Eclipse 2021)  సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉంటే చెడు సూచకలు మీ దరిచేరవని పెద్దలు చెబుతుంటారు. గ్రహణం సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇక్కడ మీకు అందిస్తున్నాం.

Also Read: Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎవరు వీక్షించవచ్చు

- గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. వీలైతే వారు టెంకాయను తమ వద్ద ఉంచుకోవాలి.

- చంద్రగ్రహణం ఏర్పడిన సమయం నుంచి గ్రహణం వీడే వరకు దేవుడు, దేవతల విగ్రహాలను తాకకూడదు. పూజా గది లేదా ఆలయం తలుపులు మూసివేయాలి.

- సూర్యగ్రహణం మరియు చంద్రగహణం పట్టిన సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. పవిత్రమైన కార్యాలు వాయిదా వేసుకోవాలి.

- గ్రహణం ఏర్పడక ముందు సిద్ధం చేసిన ఆహారం, వంటకాలు, తాగేనీటి పాత్రలలో గరకను, తులసి ఆకులను వేయాలి.

- చంద్రగ్రహణం పట్టిన తరువాత వంటలు చేయడం మరియు భోజనం చేయడం లాంటివి చేయకూడదే. అయితే ఈ సమయంలో చిన్నారులు మరియు పేషెంట్లు ఆహారం తీసుకోవచ్చు. 

Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

- గ్రహణం కొనసాగుతున్న సమయంలో గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణం సమయంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు.

- కత్తి, కత్తెర, చాకు లాంటి పదునైన వస్తువులను గ్రహణ సమయంలో ఉపయోగించకూడదు.

- గ్రహణం సమయంలో స్నానం చేయకూడదు, తల దువ్వుకోవడం లాంటివి చేయకూడదు. గ్రహణం వీడిన తరువాత మరోసారి స్నానం చేయాలి.

- ఆకలిగా ఉన్నవారు గ్రహణం వీడిన అనంతరం స్నానం చేసి, ఆహారం తీసుకోవాలి. 

- పూజా గదిని శుభ్రం చేసుకోవాలి, దేవుళ్ల విగ్రహాలు కడిగి దీపం వెలిగించడం ఉత్తమం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News