Sputnik V: ఇండియాలో వ్యాక్సిన్ కొరత త్వరలో కొద్దివరకూ తీరే పరిస్థితి కన్పిస్తోంది. ఇండియాలో అందుబాటులో వచ్చిన రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ఆగస్టు నెల నుంచి ఇండియాలోనే ఉత్పత్తి కానుండటం విశేషం.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)విజృంభణతో వ్యాక్సినేషన్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దేశ జనాభాకు అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ లేకపోవడంతో వ్యాక్సిన్ కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ఇండియాలో అందుబాటులో వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో(Dr Reddys labs) ఒప్పందమైన నేపధ్యంలో ఇప్పటికే 1 లక్షా పదివేల వ్యాక్సిన్ లు ఇండియాకు చేరుకున్నాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ స్పుట్నిక్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి రిజిస్టర్డ్ కరోనా వ్యాక్సిన్ ఇదే. ఇండియాలో డీజీసీఐ అనుమతి పొందిన మూడవ వ్యాక్సిన్ కూడా ఇదే. ఇండియాలో అందుబాటులో వచ్చినా సరే ఉత్పత్తి ఇక్కడ లేకపోవడంతో వ్యాక్సిన్ కొరత అలాగే ఉంది. ఈ క్రమంలో రష్యాలోని భారత రాయబారి గుడ్‌న్యూస్ అందించారు. ఆగస్టు నెల నుంచి ఈ వ్యాక్సిన్ ఇండియాలోనే ఉత్పత్తి కానుందని తెలిపారు.
రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి (Sputnik v vaccine) ఒక్కొక్క డోసును 995.40 రూపాయలకు విక్రయిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి ప్రారంభమైతే వ్యాక్సిన్ ధర తగ్గవచ్చని డాక్టర్ రెడ్డీస్ సంస్థ తెలిపింది. మొత్తం 85 కోట్ల వ్యాక్సిన్లు ఇండియాలో పంపిణీ చేసేందుకు రష్యన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. రెడ్డీస్ ల్యాబ్స్‌తో పాటు గ్లాండ్ ఫార్మా, హెటిరో బయోఫార్మా, పనాసీ బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, కంపెనీలు కూడా స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నాయి.
Also read: Indian Variant: ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని తొలగించాల్సిందే : కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sputnik V: ఆగస్టు నుంచి స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తి ఇండియాలోనే